శుక్రవారం సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర
శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి యాదాద్రి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. అనంతరం సంగెం నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగించనున్నారు.