అత్యాచారం కేసులో యువ క్రికెటర్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష

1563చూసినవారు
అత్యాచారం కేసులో యువ క్రికెటర్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష
మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్‌కు ఆ దేశ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన శిషిర్ రాజ్ ధఖల్ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. సందీప్‌కి 8 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. ఈ మేరకు నేపాల్ కోర్టు అధికారి రాము శర్మ తెలిపారు. కాగా గతేడాది ఆగస్టులో ఖాట్మండూలోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ కోర్టును ఆశ్రయించింది.

సంబంధిత పోస్ట్