ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ద్వారికాగంజ్ ఔట్‌పోస్ట్ పక్కనే ఉన్న ఆలయంలోని విరాళం పెట్టెలో ఉన్న నగదును దోచుకెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఆలయ పూజారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.