పుష్ప-2 సినిమా రిలీజ్ చేయొద్దు: MLA డిమాండ్
పుష్ప-2 సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటి లాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్టు చేసి, జైల్లో వేయాలి.' అని డిమాండ్ చేశారు.