ధనుష్ ‘రాయన్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. ఇది జూన్ 13న రానున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం తొలి పాటను విడుదల చేసింది. ‘‘తలవంచి ఎరగడే. తలదించి నడువడే. తలపడితే వదలడే. తన పేరు విజయుడే’’ అంటూ సినిమాలో ధనుష్ పాత్ర శక్తియుక్తుల్ని, గుణగణాల్ని వర్ణిస్తూ సాగిందీ గీతం. దీనికి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యమందించారు.