ALERT: రేపు 59 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో గురువారం వడ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడ గాలులు వీస్తాయని అంచనా వేసింది. అయితే బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్