పరవాడ ఫార్మా సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న వియాష్ లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఫార్మా పరిశ్రమ వద్ద మాట్లాడుతూ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. శుద్ధి చేయకుండా రసాయనిక వ్యర్థాలను కాలువల్లోకి వదులుతుండడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నట్లు పేర్కొన్నారు.