దెందులూరు: గ్రామ సభల్లో రీ సర్వే సమస్యలకు చెక్

దెందులూరు మండలం గోపన్నపాలెంలో రీ సర్వే, గ్రామ సభలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీ‌‌ల్దార్ సుమతి హాజరై, ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని పరిష్కరిస్తామని రీ సర్వే త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామంలో జరిగిన ఫ్రేషేర్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా సత్ప్రవర్తనతో ముందుకు వెళ్లాలంటూ సూచించారు.

సంబంధిత పోస్ట్