అల్లవరం మండలం నూతన తహశీల్దారు గా వి వి ఎల్ నరసింహ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది, పలువురు వీఆర్వోలు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.