గజపతినగరం: రాష్ట్రస్థాయి కోకో పోటీలకు మరుపల్లి విద్యార్థులు

విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మరుపల్లి హైస్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కోకో పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్ఎం నాగమణి బుధవారం సాయంత్రం తెలిపారు. ఇటీవల మరుపల్లి లో జిల్లాస్థాయి కోకో పోటీలు జరగగా మరుపల్లి క్రీడాకారులు దుక్క సురేంద్ర, తుపాకుల రమ, గడ దేశి మని, గెద్ద చైతన్యలు ఎంపికైనట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ గ్రామ లక్ష్మి హెచ్ఎం నాగమణి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్