రొళ్ల మండలంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రొళ్ల కొండపై వెలిసిన ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో దివ్య జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. వేకువ జాము నుంచి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు కొండపై ఉన్న ఉగ్ర నరసింహ స్వామి ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఆల ఎదుట పెద్ద జ్యోతిని వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు.