రాయదుర్గం పట్టణంలోని గుగ్గరట్టిలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం ఓ పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నపిల్లలు, ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పట్టణంలో కుక్కలు స్వైరవిహారంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.