అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ యాక్టర్ దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై నటి రచితా రామ్ స్పందించింది. 'రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హత్య కేసులో సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. దర్శన్ ఇలాంటి హత్య కేసులో ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదు' అంటూ రచితా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.