పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర పోషించిన విక్రమ్ మస్తాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో విక్రమ్‌కు ఫ్యాన్ ఫాలొయింగ్ పెరిగింది. తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి విక్రమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విక్రమ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ఎంపీ నకుల్నాథ్ సమక్షంలో పార్టీలో చేరాడు.