అమృత్‌సర్ ఆలయం పై బాంబు దాడి

పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శుక్రవారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఖాండ్‌వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలను విసిరి పారిపోయారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుండగులకు పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్