ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. భూకబ్జా కేసులో జీవన్‌రెడ్డిపై మోకిల పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రాంతంలోని చైతన్య రిసార్ట్స్‌లోని ఫెన్సింగ్ కూల్చివేసిన వ్యవహారంపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.