దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల రేట్లు ఎన్నడూ లేని విధంగా 11 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వరి ధరలు మరింత పెరగనున్నాయి. గత నెలలో కేంద్రం బియ్యం ధరలను 7 శాతం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, భారతీయ బియ్యం ఎగుమతుల మద్దతు ధర 9 శాతం పెరిగి ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఎల్ నినో ప్రభావంతో వరి ఉత్పత్తి తగ్గి ఈ పరిస్థితి తలెత్తింది.