ఈ నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు TSPSC పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫోటోను తప్పనిసరిగా అతికించాలని TSPSC అధికారులు తెలిపారు. ఈ ఫోటో 3 నెలలలోపు దిగినదే అయి ఉండాలన్నారు. హాల్ టికెట్‌పై ఫోటో అతికించకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని పేర్కొన్నారు. ఈ నిబంధనను HTలో పొందుపరిచినట్లు వెల్లడించారు.