సొంతూళ్లకు కదిలిన నగరవాసులు.. మెట్రో రైళ్లు కిటకిట

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో మెట్రో రైళ్లు రద్దీగా మారాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి LBనగర్, మియాపూర్, సికింద్రాబాద్‌, ఎంజీబీఎస్, JBS తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, JNTU, అమీర్‌పేట్‌, MGBS, పరేడ్ గ్రౌండ్స్, SECBAD, LB నగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది.

సంబంధిత పోస్ట్