తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి మహిళా ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.