దారుణం.. అప్పు తీసుకుని మహిళపై అత్యాచారం

AP: ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం (M) ఓ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఆమె దగ్గర అజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించమని అడిగింది.  ఈ క్రమంలో రాత్రివేళ ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె మనస్తాపనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్