బ్యాంకు ఖాతాదారులను మోసగించడానికి సైబర్ నేరగాళ్లు నేరుగా వాయిస్ కాల్స్ చేస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు అడిగి తెలుసుకొని అన్నీ సేకరించి.. డబ్బు మొత్తాన్ని లూటీ చేస్తారు. దీనినే విషింగ్ స్కాం అని అంటారు. కనుక తెలియని వ్యక్తులు ఫోన్ లేదా మెసేజ్ చేసినప్పుడు మీ బ్యాంకింగ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే చట్టబద్ధమైన బ్యాంకులు ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగవు.