జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'దేవర' జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ఈ చిత్రం, మార్చి 28న జపాన్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ జపాన్‌లో ప్రమోషన్లలో పాల్గొన్నారు. జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఎన్టీఆర్, ఈ అనుభూతిని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ "మీ ప్రేమతో నా మనసు నిండిపోయింది" అంటూ స్పందించారు.