టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్‌కు భద్రత పెంపు

పోలెండ్‌కు చెందిన ప్రపంచ నంబర్-2 ఇగా స్వైటెక్‌కు అధికారులు భద్రత పెంచారు. ఇటీవల ఆమె ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగాను అసభ్య పదజాలంతో దూషించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మియామి ఓపెన్‌లో అధికారులు ఆమెకు అదనపు భద్రత కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి WTA నిరాకరించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని టోర్నమెంట్ నిర్వాహకులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్