IPL-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. PBKS బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్* 97(42) అర్థశతకంతో రాణించగా శశాంక్* 44, ప్రియాంష్ ఆర్య 47 పరుగులు చేశారు. GT బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు తీయగా రషీద్, రబడ తలో వికెట్ తీశారు. దీంతో GT లక్ష్యం 244 పరుగులుగా ఉంది.