మహారాష్ట్రలోని పుణెలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. కొందరు పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నదిలో వరద పెరగడంతో వారు చిక్కుకుపోయారు. ఇరువైపులా తాడు కట్టి వారిని నది ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. ఈ క్రమంలో ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.