జోకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జోక్విన్ ఫీనిక్స్ నటించిన తాజా చిత్రం ‘నెపోలియన్’. గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్, ది మార్షన్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నవంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్తో మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.