ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో వర్షం (వీడియో)

ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈదురుగాలులు, పలు చోట్ల వర్షం పడుతోంది. మానుకొండూర్‌, హుజూరాబాద్‌ లో ఈదురుగాలులు వీస్తున్నాయి. మల్యాల, పెగడపల్లి, వీణవంక, సిరిసిల్ల, పెద్దపల్లి, సుల్తానాబాద్ లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. వేములవాడలో కూడా ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, పలు చోట్ల వర్షం కురుస్తోంది.

సంబంధిత పోస్ట్