యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘సలార్’ ట్రైలర్ (వీడియో)

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ ట్రైలర్‌ను ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన 10 గంటల్లోనే 28 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇక ఈ ట్రైలర్‌ను చూసిన వారు బీభత్సంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు ప్రభాస్‌‌ ఒక్క డైలాగ్ అయినా చెబితే బావుండేది అని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్