నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని నాగల్‌గిద్ద ఎస్సై బి సాయిలు అన్నారు. సోమవారం ఆయన నాగల్‌గిద్దలో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. దీంతోపాటు మద్యం సేవించి వాహనాలపై రోడ్లమీద తిరగరావద్దని హెచ్చరించారు. ఏ విధమైన అల్లర్లు సృష్టించిన చర్యలు తప్పవని సూచించారు, అదేవిధంగా దాబా హోటల్లు బెల్టు షాపులలో మద్యం అమ్మ రాదని ఎస్ఐ సాయిలు హెచ్చరించారు.
Where: నగల్ గిద్ద