దేశంలో సంస్కరణ తీసుకువచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ లెక్చరర్ గా ప్రారంభించిన మన్మోహన్ సింగ్ జీవితం ప్రధానమంత్రి వరకు ఎదిగిందని చెప్పారు. దేశం మహానేతను కోల్పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.