కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ‘సూరరై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. 2020 నవంబర్లో రిలీజ్ అయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ’సర్ఫిరా‘ పేర సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ రీమేక్ మూవీలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. జులై 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.