తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల ఎదుట మావోయిస్టు మచ్చ సోమయ్య (62) లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో సోమయ్య లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమయ్యపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కలిపి 4 కేసులు ఉన్నాయి. అతనిపై రూ.8లక్షల రివార్డ్ ఉంది. లొంగిపోయిన సోమయ్యకు మావోయిస్టుల సరెండర్ పాలసీలో భాగంగా భూమిని ఇస్తామని SP కిరణ్ ఖరె చెప్పారు. ఆయనపై ఉన్న రూ. 8లక్షల రివార్డు చెక్‌ను అందజేశారు.