అమెరికాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి వంతెనలు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా అయోవా, సౌత్ డకోటా, నెబ్రస్కా, మిన్నెసోటా రాష్ట్రాల్లో సుమారు 35 లక్షల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బ్లూఎర్త్ కౌంటీలో వరద తీవ్రతకు దక్షిణ మిన్నెసోటాలోని ప్రధాన డ్యామ్ 'ది ర్యాపిడాన్ డ్యామ్' బద్ధలైంది. దీంతో ఆ నీరంతా జనావాసాల్లోకి ప్రవేశిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.