నోరు జారి చిక్కుల్లో పడిన నేపాల్ ప్రధాని

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ నోరు జారి చిక్కుల్లో పడ్డాడు. ‘రోడ్స్ టు ది వ్యాలీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ రచించారు. ప్రధాని మాట్లాడుతూ.. తాను ప్రధానమంత్రి కావడానికి కారణం సర్దార్ ప్రీతమ్ సింగ్ అని వెల్లడించారు. తన కోసం ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపాడని, నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తనవంతు కృషి చేశారన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు విపక్షాలు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్