ఆ విషయంలో వెనక్కి తగ్గిన TG ప్రభుత్వం

తెలంగాణలో కొద్ది రోజులుగా కొత్త బీర్ బ్రాండ్లు దర్శనం ఇస్తున్నాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. మద్యం ప్రియులనుంచి వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తాజాగా బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు ఈ బ్రాండ్‌లను అమ్మవద్దని నిర్ణయించింది. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్