ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన ఫర్హాన (20) మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బస్సులో సుమారు 50 మంది వరకు ప్రయాణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్