‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన మెటా యాప్ గురువారం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్‌పై కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘థ్రెడ్స్’ యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని Ctrl+C+V (కాపీ పేస్ట్) కీలను మాత్రమే ఉపయోగించారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఆ కామెంట్‌కు ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.