ఈ వీడియోలో మిర్చితో హల్వా తయారుచేశారు. ఇందుకోసం వారు ముందుగా మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఓ పెద్ద పాత్రలో పోసి ఉడికిస్తారు. ఇలా ఉడికించిన తర్వాత అందులో చక్కెర, పాలు, నెయ్యి, జీడిపప్పులను కలుపుతారు. ఫైనల్గా ఆ మిశ్రమాన్ని మొత్తం సిద్ధంగా ఉంచుకున్న అచ్చుల్లో వేయగానే.. అది స్వీట్లాగా మారిపోతుంది. ఇది తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.