భూభారతి చట్టం కోసం చాలా కష్టపడ్డాం: పొంగులేటి

తెలంగాణలో ఫిబ్రవరి 15 నుంచి 28లోపు భూభారతి చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భూభారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూభారతి చట్టం అమలుకు విధివిధానాలు ఉన్నాయని చెప్పారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా భూభారతి చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. ధరణిని ఉపయోగించి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్