దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణల బిల్లుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ లో ఆంధ్రప్రదేశ్ నుండి అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి. ఎం రమేష్ ని నియమిస్తూ బుధవారం రాత్రి లోక్ సభ సచివాలయం వెల్లడించింది. ఈ కమిటీలో ఉభయసభలకు చెందిన 31 మందిసభ్యులు ఉంటారు. లోక్ సభకు నుండి 21 మంది సభ్యులున్నారు.