అరకులోయ మండలంలోని బస్కి సమీపంలోని రహదారి బురదమయం కావడంతో ఈ మార్గంలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రోడ్డు నిర్మాణం కొరకు రోడ్డుపై మట్టిని త్రవ్వి విడిచిపెట్టేయడంతో తుపాన్ కారణంగా కురిసిన వర్షానికి రహదారి బురదమయంగా తయారవడంతో వాహన చోదకులు గిరిజనులు రాకపోకలకు అడుగు తీసి అడుగు వేయాలని పరిస్థితి నెలకొంది. రహదారి సమస్యపై అధికారులు స్పందించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.