భీమిలి నియోజకవర్గం పీఎం పాలెం పరిధిలోని దారుణ సంఘటన చోటుచేసుకుంది. హెచ్పీసీఎల్ లేఔట్ లో 15 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. సి ఏ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని లైంగిక దాడికి పాల్పడిన సాయి తేజను అరెస్ట్ చేశారు. పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.