చోడవరం కోర్టులు సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ ఆదాలత్లో మొత్తం 810 కేసులు పరిష్కారం అయ్యాయి. వీటిలో 795 క్రిమినల్ కేసులు, 15 సివిల్ కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కే రత్నకుమార్, సివిల్ జడ్జ్ వి గౌరీ శంకర్రావు, జూనియర్ సివిల్ జడ్జి ఏ రమేష్, చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె కృష్ణవేణి, సిఐ పి అప్పలరాజు తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు.