వడ్డాది ఎన్టీఎస్ స్కూల్లో గత మూడు నెలలుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన 64 మంది విద్యార్థులను ఉద్దేశించి అనకాపల్లి జీవీఎంసీ హైస్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రెటరీ కొణతాల రత్న కుమారి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి డీఈఓ ఎన్టీఎస్ స్కూల్ భారత్ స్కౌట్ మాస్టర్ కి శిక్షణ ధ్రువీకరణ పత్రం అందజేశారు.