బంగారు మెట్టలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

85చూసినవారు
బంగారు మెట్టలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
బుచ్చయ్య పేట మండలం బంగారు మెట్టలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శంకుస్థాపన చేశారు. బంగారు మెట్ట, ఎల్బిపురం గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి అన్ని విధాలా తన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నారు.

సంబంధిత పోస్ట్