రావికమతం: "ప్రతీ 6 నెలలకు పశువులకు నట్టల నివారణ చేపట్టాలి"

81చూసినవారు
రావికమతం: "ప్రతీ 6 నెలలకు పశువులకు నట్టల నివారణ  చేపట్టాలి"
పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను రావికమతం మండలంలో బుధవారం కన్నంపేట పాల కేంద్రం వద్ద నిర్వహించారు. వైస్ ఎంపీపీ శ్రీ దంట్ల వెంకటరమణ, రాజేష్ ప్రారంభించిన ఈ శిబిరంలో పశువులకు నట్ట ల నివారణ మందులు, చిన్న పశువులకు వ్యాక్సిన్లు అందించి అనారోగ్యంతో ఉన్న పశువులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. 32 పశువులకు డా. బాల తేజ వైద్య సేవలు, డా. నూకేశ్వర్ రావు 87 పశువులకు నులిపురుగుల మందు  అందించారు.

సంబంధిత పోస్ట్