విశాఖ జిల్లాలో మూడు ప్రైవేట్ ఏజెన్సీ ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ముడసర్లోవ, గాజువాక భీమిలిలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ల వద్ద సోమవారం నుంచి ఇసుక అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక రూ. 700 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు.