జాతీయ స్థాయిలో విశాఖ ఉక్కు కు అవార్డు
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ - గ్రీన్ బిజినెస్ సెంటర్ నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పొందింది. ఇంధన సామర్థ్యం, పరిరక్షణలో మరోసారి ప్రతిభ చాటుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెక్రటరీ మిలింద్ దేవరా నుంచి అవార్డును స్టీల్‌ప్లాంట్ జీఎం సుధాకర్ అందుకున్నారు.