నర్సీపట్నంలో జాతీయ లోక్ అదాలత్

80చూసినవారు
నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మధుసూదన్ రావు కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ ప్రయత్నం చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టా ప్రభాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్